Brahmamudi : యామిని వాళ్ళ నాన్నకి హార్ట్ ఎటాక్.. పెళ్లికి ఒప్పుకున్న రాజ్!
on Mar 29, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -681 లో.....కావ్య పంపిన భోజనం రాజ్ తింటుంటాడు. చాలా బాగుందని లోట్టలేసుకొని తింటుంటే యామినికి కోపం వస్తుంది. ఇంత ఆయిల్ ఉన్న ఫుడ్ తినకూడదని డాక్టర్ చెప్తేనే కదా నీకు రోజు లైట్ ఫుడ్ చేస్తున్నానని యామిని అంటుంది. ఈ ఒక్క రోజే కదా అని రాజ్ తింటాడు. దాంతో యామిని కోపంగా అక్కడ నుండీ వెళ్ళిపోతుంది. ఈ ఒక్కరోజే కదా తినండి అంకుల్ అని యామిని వాళ్ళ నాన్నతో రాజ్ అంటాడు.
నేను చేసిన వంట నచ్చిందో లేదో అని కావ్య టెన్షన్ పడుతుంది. మరొకవైపు కళావతి గారు చేసిన వంటలు చాలా బాగున్నాయి. ఆ విషయం ఇప్పడు తనకేలా చెప్పాలని రాజ్ ఆలోచిస్తాడు. క్యారేజ్ కి ఉన్న పేపర్ ని యామిని చింపేసింది.. గుర్తు చేసుకొని డస్ట్ బిన్ లో నుండి తీసి పేపర్ పై ఉన్న నెంబర్ తీసుకొని వంటలు చాలా బాగున్నాయంటూ కావ్యకి రాజ్ మెసేజ్ చేస్తాడు. దాంతో కావ్య చాలా ఎక్సైట్ అవుతుంది. అదంతా రుద్రాణి చూసి దీనికేం అయింది.. ఇలా చేస్తుంది అనుకుటుంది. మరొకవైపు రాజ్ కావ్యతో చాటింగ్ చేయడం యామిని చూసి ఇక నేను ఇలా ఉంటే నడవదు.. నేనంటే ఏంటో చుపిస్తానని యామిని అనుకుంటుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి అప్పు వచ్చి ఆ క్యారేజ్ ఎవరికి పంపావని అడుగుతుంది. మీ బావగారికి అంటూ జరిగింది మొత్తం అప్పుకి కావ్య చెప్తుంది. అసలు ఆ డాక్టర్ , యామిని కలిసి ఇదంతా చేస్తున్నారని కావ్య అంటుంది.
రేపు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి అసలు ఏం జరిగిందో కనుకోవాలని అప్పు, కావ్య ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత యామిని వాళ్ళ నాన్న జాగింగ్ చేసి వచ్చి రాజ్ తో మాట్లాడుతుంటే. హార్ట్ ఎటాక్ వస్తుంది. రాజ్ వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. అతను బానే ఉంటాడు. నాకు ఏమైనా అయితే నా కూతురు పరిస్థితి ఏంటి వెంటనే నీకు యామినికి పెళ్లి చెయ్యాలని అతను అంటాడు. తరువాయి భాగంలో యామినిని పెళ్లి చేసుకుంటానని రాజ్ తన తండ్రికి మాటిస్తాడు. మరొకవైపు అప్పు, కావ్య ఇద్దరు యామిని నటించమని చెప్పిన డాక్టర్ దగ్గరికి వచ్చి అసలు నిజం తెలుసుకుంటారు. యామిని రాజ్ ని హగ్ చేసుకొని థాంక్స్ పెళ్లికి ఒప్పుకున్నందుకని చెప్పడం కావ్య విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
